
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ లో ఇండియా పేలవంగా టోర్నీ ఆరంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన మన జట్టు ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పాకిస్థాన్ తో మ్యాచ్ రద్దు చేసుకున్న మన జట్టు.. సౌతాఫ్రికా ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ పై మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరుకునే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఇండియా ఛాంపియన్స్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా సెమీస్ వెళ్లే అవకాశాలు ఉన్నాయో లేదో చూద్దాం.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు ఆడుతున్న ఈ టోర్నమెంట్ లో ఒక జట్టు మిగిలిన జట్టుతో ఒక్కో మ్యాచ్ లో తలబడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం ఈ టోర్నీలో సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. మిగిలిన ఓకే బెర్త్ కోసం ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇండియా పోరాడుతున్నాయి. ప్రస్తుతం భారత జట్టు ఒకే పాయింట్ తో పాయింట్ల పత్తిఆకాలో చివరి స్థానంలో నిలిచింది.
ALSO READ : IND vs ENG 2025: ఇంగ్లాండ్ పేసర్ బాల్ టాంపరింగ్..కెమెరాకు అడ్డంగా దొరికిన కార్స్
మంగళవారం (జూలై 29) వెస్టిండీస్ ఛాంపియన్స్ తో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ గెలిస్తే మాత్రమే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ ఛాంపియన్స్ కూడా 3 పాయింట్లతో ఉంది. ఇండియా సెమీస్ కు చేరాలంటే వెస్టిండీస్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. 40 నుంచి 60 పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్ కు అర్హత సాధించవచ్చు. వెస్టిండీస్ కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇండియాను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ కు అర్హత సాధిస్తుంది.