వుమెన్స్ వరల్డ్ కప్: ఇండియాను ఆదుకున్న మిడిలార్డర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..

వుమెన్స్ వరల్డ్ కప్: ఇండియాను ఆదుకున్న మిడిలార్డర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..

వుమెన్స్ వండే వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా తడబడి నిలబడింది. టాప్ ఆర్డర్ ఓ మోస్తరు స్కోరుతో పెవిలియన్ బాట పట్టిన వేళ.. మిడిలార్డర్లు నిలబడి మంచి స్కోరును సాధించారు. 124 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయిన ఇండియాను అమన్ జోత్ కౌర్, దీప్తి శర్మ ఆదుకోవడంతో 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఇండియా 269 రన్స్ చేయగలిగింది. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఇనోక రనవీర 4 వికెట్లతో చెలరేగడంతో ఇండియా కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ బ్యాటర్ స్మృతి మంధన 8 రన్స్ కే ఔట్ అవ్వడంతో.. ప్రతీక రావల్ (37), హర్లీన్ డియోల్ (48) రాణించారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 21 రన్స్ కే వెనుదిరగగా.. జెమీమా రోట్రిగ్స్ డకౌట్ అవ్వడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఈ టైమ్ లో అమన్ జోత్ కౌర్ (56 బంతుల్లో 57 రన్స్), ఆల్ రౌండర్ దీప్తి శర్మ (53 బాల్స్ లో 53 రన్స్)  హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. చివర్లో స్నేహ రానా (15 బంతుల్లో 28) రెండు సిక్సులు, రెండు ఫోర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇండియా స్కోర్ 269కి చేరుకుంది. 

 వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో.. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుని ఫస్ట్ హాఫ్ లో మ్యాచ్ పై పట్టు బిగించింది. శ్రీలంక బౌలర్లలో ఇనోక రణవీర 4 వికెట్లు తీసుకుని ఇండియాపై పెద్ద దెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఉదేశిక పరబోధని 2 వికెట్లు, అచిని కులసూర్రయ, కెప్టెన్ చమరి ఆటపట్టు చెరో వికెట్ తీసుకున్నారు.