సౌతాఫ్రికాతో టీ 20 సిరీస్‌.. ఉమ్రాన్ మాలిక్‌‌కు ఛాన్స్

సౌతాఫ్రికాతో టీ 20 సిరీస్‌.. ఉమ్రాన్ మాలిక్‌‌కు ఛాన్స్

సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌ కోసం ఇండియా జట్టును ఎంపిక చేశారు. 2022, మే 22వ తేదీ ఆదివారం సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఐపీఎల్‌‌లో రాణిస్తున్న పేసర్లు ఉమ్రాన్‌‌ మాలిక్‌‌, ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యాలను సెలక్ట్ చేశారు. వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డ పాండ్యా.. ప్రస్తుతం మెగా లీగ్‌‌లో బ్యాటింగ్‌‌తో పాటు బౌలింగ్‌‌లోనూ రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ 20 (T20) సిరీస్ జూన్ 09వ తేదీన ప్రారంభం కానుంది. అలాగే.. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు.. నిరుడు ఐదో టెస్టు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ ను టీమిండియా ఆడనుంది. ఈ మ్యాచ్ జులై 01న బర్మింగ్ హోమ్ లో జరుగనుంది. దీనికి కూడా సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అనంతరం ఇంగ్లాండ్ తో భారత్ టీ 20 మ్యాచ్ లు, మూడు వన్డేలు ఆడనుంది. 

రోజు తేదీ మ్యాచ్ వేదిక
గురువారం జూన్ 09 1st T20I ఢిల్లీ
ఆదివారం జూన్ 12 2nd T20I కటక్
మంగళవారం   జూన్ 14th 3rd T20I వైజాగ్
శుక్రవారం   జూన్ 17th 4th T20I రాజ్ కోట్
ఆదివారం జూన్ 19th 5th T20I బెంగళూరు

టీ 20 జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వీకెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, వై చాహల్, కుల్ దీప్  యాదవ్, అక్షర్ పటేల్, ఆర్. బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లున్నారు. 

ఇంగ్లాండ్ తో 5వ టెస్టుకు టీం : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టన్) శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, ఛతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కె.ఎస్. భరత్ (వికెట్ కీపర్), ఆర్. జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శ్రార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణలున్నారు. 

మరిన్ని వార్తల కోసం :-

మోడీతో బ్యాడ్మింటన్ బృందం భేటీ


నేడు సౌతాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా ఎంపిక