అగ్ని-5 మిస్సైల్ పరీక్ష సక్సెస్

అగ్ని-5 మిస్సైల్ పరీక్ష సక్సెస్

బాలాసోర్: ఒడిశాలోని చాందీపూర్‌‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ‘అగ్ని-5’ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది. 

ఈ ప్రయోగం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్ సీ) ఆధ్వర్యంలో జరిగిందని.. ఈ ప్రయోగం అన్ని ఆపరేషనల్, సాంకేతిక ప్రమాణాలను విజయవంతంగా నిర్ధారించినట్లు వివరించింది. అగ్ని-5 మిస్సైల్‌‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) పూర్తి స్వదేశీ టెక్నాలజీతో  అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఈ మిస్సైల్ 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుందని చెప్పింది. ఈ పరీక్ష మన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసిందని, దేశ భద్రతా అవసరాలను తీర్చడంలో అగ్ని-5 కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు.