QRSAM సిస్టమ్ 6 విమాన పరీక్షలు విజయవంతం

QRSAM సిస్టమ్ 6 విమాన పరీక్షలు విజయవంతం

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (QRSM) వ్యవస్థ పరీక్ష విజయవంతం అయింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)  నుంచి డిఆర్డీవో, భారత ఆర్మీ సంయుక్తంగా క్యూఆర్ఎస్ఏఎం పరీక్షను నిర్వహించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. QRSAM సిస్టమ్ యొక్క 6 విమాన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఆకాశంలో ఉన్న డమ్మీ శతృ వస్తువును అత్యంత కచ్చితత్వంతో QRSM సిస్టమ్ పేల్చడం విశేషం. 

చివరి విస్తరణ కాన్ఫిరిగేషన్‌లో భాగంగా స్వదేశీ ఆర్‌ఎఫ్‌ సీకర్‌, మొబైల్ లాంచర్, పూర్తిగా ఆటోమేటెడ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్, నిఘా, మల్టీ ఫంక్షన్ రాడార్‌లతో కూడిన క్షిపణితో సహా స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన అన్ని సబ్‌ సిస్టమ్స్‌ను ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఈ మిస్సైల్‌ ఓ షార్ట్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ సిస్టమ్‌. ఈ మిస్సైల్‌ 30 కిలోమీటర్ల పరిధిలో పది కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఎరిగే లక్ష్యాలను కూడా ఛేదించగలదు. అన్ని వేళల్లో క్యూఆర్ఎస్ఎమ్ పనితీరును పరీక్షించారు. అన్ని పరీక్షలో ఈ క్షిపణి విజయవంతం అయినట్లు సైన్యం.. డీఆర్డీవో ప్రకటించింది.

అత్యాధునిక సాంకేతికతతో రూపొందించి ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో గాలిలో ఉన్న మరో వస్తువును నేల కూల్చింది. ఈ నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థకు క్యూఆర్ఎస్ కీలకంగా మారే అవకాశం ఉంది. శత్రుదేశాల విమానాలు, డ్రోన్లను గుర్తించి కూల్చివేయడంలో క్యూర్ కీలకంగా ఉపయోగపడనుంది.