బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం

 బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యింది. ఇండియన్ నేవీ డిస్ట్రాయర్ INS విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో పరీక్షించారు.క్షిపణి సముద్రం నుంచి సముద్రం వేరియంట్‌ను గరిష్ట రేంజ్‌లో పరీక్షించగా నిర్ధిష్టమైన, ఖచ్చితత్వంతో టార్గెట్ షిప్‌ను ఢీకొట్టింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఈ విషయాన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిస్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇండియన్ నేవీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. చైనా, పాక్‌లతో సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తత నెలకొన్న సమయంలో భారత్ ఈ పరీక్ష చేయడం విశేషం.

డిసెంబరు 8న, సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఎయిర్ టు ఎయిర్ వేరియంట్‌ను ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.  దీనికి సంబంధించిన  విషయాన్ని DRDO వర్గాలు ట్విట్టర్ లో ట్వీట్ చేశాయి.

మరిన్ని వార్తల కోసం..

వానరానికి శ్రాద్ధకర్మలు.. ఇద్దరి అరెస్ట్