ఆస్ట్రేలియాకు చెక్‌‌‌‌.. ఇండియా గ్రాండ్ విక్టరీ

ఆస్ట్రేలియాకు చెక్‌‌‌‌.. ఇండియా గ్రాండ్ విక్టరీ

న్యూఢిల్లీ: మహిళల తొలి అంధుల టీ20 కప్‌‌‌‌లో ఇండియా టీమ్‌‌‌‌ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా 209 రన్స్‌‌‌‌ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 292/4 స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌ దీపికా (58 బాల్స్‌‌‌‌లో 91), ఫూలా సారెన్ (22 బాల్స్‌‌‌‌లో 54 నాటౌట్‌‌‌‌) రాణించారు. ఆసీస్‌‌‌‌ 52 ఎక్స్‌‌‌‌ట్రాలతో పాటు 26 రన్స్‌‌‌‌ పెనాల్టీగా ఇచ్చుకుంది. తర్వాత ఛేజింగ్‌‌‌‌కు దిగిన ఆసీస్‌‌‌‌ 19.3 ఓవర్లలో 57 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. దీపికాకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. మరో మ్యాచ్‌‌‌‌లో నేపాల్‌‌‌‌ 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. 88 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని నేపాల్‌‌‌‌ 5.2 ఓవర్లలో అందుకుంది.