సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. భద్రతను పటిష్టం చేస్తున్న ఇండియా

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. భద్రతను పటిష్టం చేస్తున్న ఇండియా

న్యూఢిల్లీ: చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో సరిహద్దుల్లో ఇండియా భద్రతను పటిష్టం చేస్తోంది. నేపాల్, భూటాన్ తో బార్డర్స్ లో సెక్యూరిటీని పెంచుతోంది. ఉద్రిక్తతలు తగ్గే వరకు బార్డర్స్ లో హై అలర్డ్ ప్రకటించింది. మంగళవారం జరిగిన సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చైనాతోపాటు భూటాన్, నేపాల్ సరిహద్దులను కూడా పహారాను పెంచాలని, నిత్యం అలర్ట్ గా ఉండాలని నిర్ణయించారని సమాచారం. ఈ మేరకు ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్, లడఖ్, సిక్కింల్లో అప్రమత్తంగా ఉండాలని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు సూచనలు వెళ్లాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇండో-చైనా మధ్య నెలకొన్న బార్డర్ సమస్యకు పరిష్కారంలో భాగంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు బుధవారం కూడా కొనసాగాయి. బ్రిగేడ్ లెవల్ చర్చలు బుధవారం చూషుల్ లేదా మోల్డోలో నిర్వహిస్తారని సమాచారం. రీసెంట్ గా పాంగాంగ్ లేక్ దగ్గర్ యథాతథ స్థితికి భంగం కలిగించడానికి చైనా దళాలు యత్నించాయి. వీటిని ఇండియన్ ఆర్మీ దీటుగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఒకవైపు చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు దుశ్చర్యకు పాల్పడటంపై ఇండియా సీరియస్ గా ఉంది. దౌత్యపరమైన, మిలటరీ లెవర్ చర్చల్లో ఈ విషయంపై చైనాను భారత్ ప్రశ్నించనుంది.