
- కొత్త వలసల చట్టం–2025 ప్రకారం నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో డ్రగ్స్ అక్రమ వ్యాపారంతో సంబంధాలు ఉన్న 16 వేల మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్రవాణా, వ్యాపారంతో సంబంధం ఉన్న వీరంతా బంగ్లాదేశ్, మయన్మార్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఘనా, నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు.
ఇటీవల దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల కారిడార్(డ్రగ్ట్రాఫికింగ్రూట్స్)లో వీరు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇందులో చాలా మంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. కొత్త వలసల చట్టం (2025) ప్రకారం ఈ బహిష్కరణ ఉంటుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్నాయి.