దాదాపు 7.5 లక్షల ఏకే–203 రైఫిల్స్ తయారీ కోసం ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రష్యా సాంకేతిక సాయం అందించనుంది. రెండు దేశాల మధ్య త్వరలోనే ఒప్పందం కుదరనుంది. కేంద్ర బలగాల కోసం ఈ రైఫిల్స్ ను ఇండియా వాడనుంది. ప్రస్తుతం కేంద్ర బలగాలు ఐఎన్ఎస్ఏఎస్ గన్స్ ను వాడుతున్నాయి. పాపులర్ ఏకే–47కు అప్ గ్రేడే ఏకే–203. ప్రపంచంలోని చాలా దేశాలు, టెర్రరిస్టు గ్రూపులు ఏకే–203ని వాడుతున్నాయి. ఏకే సిరీస్ లో సరికొత్త ఆయుధం ఏకే–308. దీని ప్రొటోటైప్ ఇటీవలే సిద్ధమైంది. హెవీ బ్యారెల్స్ ను వాడేలా దీన్ని రూపొందించారు.
