న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతీకారంగా భారత బలగాలు చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ లో ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కీలకపాత్ర పోషించింది. 2018లో రష్యాతో ఒప్పందం చేసుకుని ఈ మిసైల్ సిస్టమ్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో ఎస్ 400 వందల కిలోమీటర్ల దూరంలో శత్రుదేశ ఎయిర్ క్రాఫ్ట్‌లను అత్యంత కచ్చితంగా ట్రేస్ చేసి కూల్చిపారేసింది. పాక్ మిసైళ్లు మన దేశంలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు ఎస్ 400కు అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా ఎస్ 500ను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4, 5న భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్ 500 కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్ ఒప్పందం
కుదుర్చుకోనుంది. దీంతో మన దేశ ఎయిర్ డిఫెన్స్ మరింత బలోపేతం కానుంది.
