ఎకానమీలో ఇండియా జపాన్‌ను దాటేస్తది

ఎకానమీలో ఇండియా జపాన్‌ను దాటేస్తది

2050 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా

వెల్లడించిన లాన్సెట్‌ జర్నల్‌

న్యూఢిల్లీ: ఎకానమీ పరంగా 2050 నాటికి జపాన్‌‌ను ఇండియా దాటుతుందని మెడికల్‌‌ జర్నల్‌‌ లాన్సెట్ పేర్కొంది. అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంచనా వేసింది. 2100 నాటికి కూడా తన స్థానాన్ని నిలుపుకుంటుందని తెలిపింది. దేశంలో వర్కింగ్​ ఏజ్‌‌ గ్రూప్‌‌ ఆధారంగా దేశ జీడీపీలను లాన్సెట్‌‌ లెక్కించింది. 2017 లో గ్లోబల్‌‌గా ఏడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా నిలిచింది. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఎకానమీగా ఎదిగింది. అమెరికా, చైనా, జపాన్‌‌, జర్మనీ ఆర్థిక వ్యవస్థల తర్వాత ఇండియా ఉంది. ఫ్రాన్స్‌‌, ఇంగ్లండ్‌‌ ఆర్థిక వ్యవస్థలు కొద్ది తేడాలోనే  ఇండియా కంటే వెనుక ఉన్నాయి. 2030 నాటికి ఇండియన్‌‌ ఎకానమీ గ్లోబల్‌‌గా నాలుగో అతిపెద్ద ఎకానమీగా నిలుస్తుందని లాన్సెట్‌‌ పేర్కొంది. 2050 నాటికి జపాన్‌‌ను అధిగమిస్తుందని అంచనా వేసింది.   ప్రభుత్వం కూడా దాదాపు ఇదే అంచనాతో ఉంది. కానీ కరోనా క్రైసిస్‌‌ వల్ల  దేశ ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్‌‌ను ఎదుర్కొంటోంది. దీంతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఇండియాకు కష్టమని నిపుణులు అంటున్నారు.    ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకున్న 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం కూడా కరోనా వలన ఆలస్యమవుతుందని చెబుతున్నారు.