సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్ లు వాయిదా

V6 Velugu Posted on Dec 04, 2021

సౌతాఫ్రికాతో జరగాల్సిన నాలుగు టీ20 మ్యాచ్ లను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సౌతాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. భారత జట్టు డిసెంబర్ 17 నుంచి సౌతాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 లు ఆడాల్సి ఉంది. అయితే ఆతిథ్య దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో టీ20లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. మూడు టెస్టులు, మూడు వన్డేలు యదావిధిగా ఆడతామని స్పష్టం చేసింది. 
 

Tagged Cricket, India, sports, bcci, southafrica, India tour, omicron, southafrica tour schedule

Latest Videos

Subscribe Now

More News