
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ టీమిండియా రద్దు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐకి ఇండియన్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ సిరీస్ ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగానే ఈ సిరీస్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. సిరీస్ ఆడేందుకు బంగ్లా బోర్డు సిద్ధంగా ఉన్నప్పటికీ టీమిండియాను పంపేందుకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. దీంతో ఇప్పుడు రోహిత్ , కోహ్లిలను టీమిండియాలో చూసేందుకు ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడక తప్పట్లేదు.
బంగ్లాతో సిరీస్ దాదాపుగా రద్దు కావడంతో భారత్ తర్వాత ఆడబోయే సిరీస్ గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా వన్డే సిరీస్ పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం రోహిత్, కోహ్లీలే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్, కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వీరిద్దరూ ఒకేసారి టీ20, వన్డే సిరీస్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వీరిద్దరినీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడూ వన్డేల్లో చూడాలా అని ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్ సిరీస్ రద్దు కావడంతో టీమిండియా తమ తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమవుతుంది.
ALSO READ : BAN vs IND: ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్‌కు బ్రేక్ : మనకు పాకిస్తాన్ ఎంతో బంగ్లాదేశ్ అంతేనా..?
2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. కోహ్లీ, రోహిత్ లను ఇకపై ఆస్ట్రేలియాలో చూడబోతున్నాం. 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు వీరిద్దరూ ఆడి తమ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.