BAN vs IND: ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్‌కు బ్రేక్ : మనకు పాకిస్తాన్ ఎంతో బంగ్లాదేశ్ అంతేనా..?

BAN vs IND: ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్‌కు బ్రేక్ : మనకు పాకిస్తాన్ ఎంతో బంగ్లాదేశ్ అంతేనా..?

భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడబోయే వన్డే, టీ20 సిరీస్ జరిగే సూచనలు కనిపించడం లేదు. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఆగస్టు నెలలో జరగబోయే ఈ టూర్ కు భారత్ పర్యటించేది అనుమానంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగానే ఈ సిరీస్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్టు వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదనట్టు సమాచారం. 

ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. త్వరలోనే ఈ సిరీస్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.మరోవైపు భారత్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తామెప్పుడూ సిద్ధమేనని బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు(బీసీబీ) తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరీస్‌ను వాయిదా వేయడమా? లేక పూర్తిగా రద్దు చేయడమా? అనే అంశంపై బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

ALSO READ : మా నాన్న ఫోన్ చేసి ట్రిపుల్ సెంచరీ మిస్ చేశావు అన్నాడు: గిల్

దుబాయ్‌ వేదికగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. మొదట వన్డే సిరీస్ ఆగస్టు 17న ప్రారంభమవుతుంది. మీర్పూర్ వేదికగా ఆగస్ట్ 17, 20 న తొలి రెండు వన్డేలు జరుగుతాయి. చట్టోగ్రామ్ లో ఆగస్టు 23 న మూడో వన్డే జరగనుంది.మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్ట్ 26 న చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఆగస్టు 29, ఆగస్టు 31 న వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌తో ఓవరాల్ గా 25 వన్డేలు ఆడితే.. ఆరు ఓడిపోయి, 18 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.