IND vs SA: నాలుగు వికెట్లతో పాటు గిల్ రిటైర్డ్ హర్ట్.. కోల్‌‌‌‌కతా టెస్టులో టీమిండియాకు సౌతాఫ్రికా గట్టి పోటీ

IND vs SA: నాలుగు వికెట్లతో పాటు గిల్ రిటైర్డ్ హర్ట్.. కోల్‌‌‌‌కతా టెస్టులో టీమిండియాకు సౌతాఫ్రికా గట్టి పోటీ

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ లో తడబడుతోంది. బ్యాటింగ్ లో ప్రతి ఒక్కరూ పర్వాలేదనిపించినా భారీ స్కోర్ చేయలేకపోయారు. కోల్‌‌‌‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో శనివారం (నవంబర్ 15) రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి సెషన్ లో మూడు వికెట్లు తీసుకొని టీమిండియాకు పోటీనిస్తుంది. రెండో రోజు లంచ్ సమాయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (11), ధృవ్ జురెల్ (5) ఉన్నారు. ప్రస్తుతం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 21 పరుగులు వెనకబడి ఉంది. జడేజా, జురెల్ బాగస్వామ్యంపై టీమిండియా ఆశలు పెట్టుకుంది. 

వికెట్ నష్టానికి 37 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. తొలి సెషన్ లో 101 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. సుందర్, రాహుల్ ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. క్రీజ్ లో కుదురుకున్న తర్వాత వీరిద్దరూ వేగం పెంచారు. దీంతో భారత్ స్కోర్ వేగంగా వెళ్ళింది. రెండో వికెట్ కు 57 పరుగులు జోడించిన తర్వాత క్రీజ్ లో పాతుకుపోయిన ఈ జోడీని సఫారీ స్పిన్నర్ హార్మర్ విడగొట్టాడు. ఒక ఎక్స్ ట్రా బౌన్సర్ తో సుందర్ (29)ను బోల్తా కొట్టించడంతో ఇండియా 75 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 

తొలి రోజు నిదానంగా ఆడిన రాహుల్ రెండో రోజు వేగంగా ఆడాడు. కొన్ని బౌండరీలతో మంచి టచ్ లో కనిపించిన కేఎల్.. 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. బంతిని కొందకి ఆడాలని చూసిన రాహుల్.. స్లిప్ లో మార్కరం కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ రిటైర్డ్ హర్ట్ తో క్రీజ్ లోకి వచ్చిన పంత్ ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో బౌండరీల వర్షం కురిపించాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన పంత్ 24 బంతుల్లోనే 2ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి లంచ్ కు ముందు పెవిలియన్ చేరాడు. పంత్ వికెట్ సఫారీలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, మహరాజ్, హార్మర్,కార్బిన్ బాష్ తలో వికెట్ పడగొట్టారు.