గౌహతి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా తొలి సెషన్ లో భారత టాపార్డర్ ను పెవిలియన్ కు పంపించడంతో మూడు రోజు తొలి సెషన్ లోనే నాలుగు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఓపెనర్లు రాహుల్, జైశ్వాల్ తొలి వికెట్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చినా వరుస విరామాల్లో భారత జట్టు వికెట్లను కోల్పోతూ వచ్చింది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (6), జడేజా (0) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. పంత్, జడేజా భాగస్వామ్యంపైనే జట్టు ఆధారపడింది. రెండో సెషన్ లో వికెట్లు కోల్పోకుండా ఆడడం టీమిండియాకు చాల కీలకం.
వికెట్ నష్టపోకుండా 9 పరుగులతో మూడో రోజ్ ఆట ప్రారంభించిన ఇండియాకు ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి గంట సేపు జాగ్రత్తగా ఆడుతూ సఫారీలకు వికెట్ ఇవ్వలేదు. ఒక ఎండ్ లో జైశ్వాల్ వేగంగా ఆడితే మరో ఎండ్ లో రాహుల్ డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. తొలి వికెట్ కు 65 పరుగులు జోడించిన తర్వాత రాహుల్ ను మహరాజ్ ఔట్ చేసి తొలి వికెట్ సంపాదించాడు. ఈ దశలో సాయి సుదర్శన్, జైశ్వాల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 30 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచేందుకు ప్రయతించారు. ఈ క్రమంలో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వికెట్ నష్టానికి 95 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత జట్టు టీ విరామానికి ముందు వరుసగా వికెట్లను కోల్పోయింది. హార్మర్ తన స్పిన్ తో జైశ్వాల్ ను బోల్తా కొట్టించగా.. కాసేపటికే సాయి సుదర్శన్ రికెల్ టన్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు. జాన్సెన్ బౌలింగ్ లో షార్ట్ బల్లను బౌండరీ తరలించాలని భావించిన ధృవ్ జురెల్ మిడాన్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఒక దశలో వికెట్ నష్టానికి 95 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్ ఒక్కసారిగా వరుసగా వికెట్లను కోల్పోతూ నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులతో కష్టాల్లో నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ రెండు.. జాన్సెన్, మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
From 95 for 1 to 102 for 4... South Africa take control in Guwahatihttps://t.co/LQtmdEJE3q #INDvSA pic.twitter.com/jkVAHv3H33
— ESPNcricinfo (@ESPNcricinfo) November 24, 2025
