అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌పై కుర్రాళ్ల పంజా

అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌పై కుర్రాళ్ల పంజా
  •     అండర్‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌ లో 90  రన్స్ తేడాతో ఇండియా విక్టరీ
  •     సత్తా చాటిన హైదరాబాద్ క్రికెటర్ ఆరోన్ జార్జ్‌‌‌‌‌‌‌‌, కనిష్క్‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌: దాయాది పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై ఇండియా మరోసారి పంజా విసిరింది. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. హైదరాబాద్ క్రికెటర్ ఆరోన్ జార్జ్ (88 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 85)తో పాటు కనిష్క్‌‌​  చౌహాన్​ (46; 3/33) ఆల్‌‌రౌండ్‌‌ మెరుపులతో  ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  ఇండియా కుర్రాళ్లు 90 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నారు. 

ఈ పోరులో తొలుత ఇండియా 46.1 ఓవర్లలో 240 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.  డ్యాషింగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ (5)తో పాటు విహాన్ మల్హోత్రా (12), వేదాంత్ త్రివేది (7) ఫెయిలైనా.. ఆరోన్ జార్జ్‌‌‌‌‌‌‌‌ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (38), అభిగ్యాన్‌‌‌‌‌‌‌‌ కుండు (22) కూడా రాణించారు. అనంతరం  దీపేశ్ దేవేంద్రన్ (3/16), కనిష్క్‌‌​,  కిషన్ కుమార్ (2/33) దెబ్బకు ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో  పాక్ 41.2 ఓవర్లలో 150 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. హుజైఫా (70) తప్ప మిగతా బ్యాటర్లంతా ఫెయిలయ్యారు. కనిష్క్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల మాదిరిగా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా కుర్రాళ్లు..  ఆటకు ముందు తర్వాత పాక్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లకు షేక్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్ ఇవ్వలేదు.