అండర్ 19లో కుర్రాళ్లు కుమ్మేశారు..

అండర్ 19లో కుర్రాళ్లు కుమ్మేశారు..

బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో అభిగ్యాన్‌‌‌‌‌‌‌‌ కుండు (71), వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ (70), విహాన్‌‌‌‌‌‌‌‌ మల్హోత్రా (70)కు తోడు బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఆయుష్‌‌‌‌‌‌‌‌ మాత్రే (3/27) రాణించడంతో.. బుధవారం జరిగిన రెండో యూత్‌‌‌‌‌‌‌‌ వన్డేలోనూ ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌–19 జట్టు 51 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఆస్ట్రేలియా అండర్‌‌‌‌‌‌‌‌-–19పై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా 49.4 ఓవర్లలో 300 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ రెండో బాల్‌‌‌‌‌‌‌‌కే ఆయుష్‌‌‌‌‌‌‌‌ మాత్రే (0) డకౌటైనా, వైభవ్‌‌‌‌‌‌‌‌, విహాన్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడారు.

 రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 117 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి వైభవ్‌‌‌‌‌‌‌‌ వెనుదిరిగాడు. ఈ క్రమంలో యూత్‌‌‌‌‌‌‌‌ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఉన్ముక్త్‌‌‌‌‌‌‌‌ చంద్‌‌‌‌‌‌‌‌ (38) రికార్డును వైభవ్‌‌‌‌‌‌‌‌ (41) బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత విహాన్‌‌‌‌‌‌‌‌.. వేదాంత్‌‌‌‌‌‌‌‌ త్రివేది (26)తో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 42, అభిగ్యాన్‌‌‌‌‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేశాడు. చివర్లో అభిగ్యాన్‌‌‌‌‌‌‌‌, హెనిల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (9) తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 41 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. విల్‌‌‌‌‌‌‌‌ బైరామ్‌‌‌‌‌‌‌‌ 3, యష్‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 249 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. జైడెన్‌‌‌‌‌‌‌‌ డ్రాపర్‌‌‌‌‌‌‌‌ (107) సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. లీ యంగ్‌‌‌‌‌‌‌‌ (11)తో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 42, ఆర్యన్‌‌‌‌‌‌‌‌ శర్మ (38)తో ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 112 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసినా ప్రయోజనం దక్కలేదు. కనిష్క్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు తీశాడు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే శుక్రవారం బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌లోనే జరుగుతుంది.