ఇవాళ ఆస్ట్రేలియాతో ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్

ఇవాళ ఆస్ట్రేలియాతో ఇండియా  అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్
  •      కుర్రాళ్లు కుమ్మేస్తరా?
  •     సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా
  •     మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బెనోని: అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరులో బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిరుగులేని ఆటతో చెలరేగిన టీమిండియా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ గెలిచి ఆరోసారి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో పాటు గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్ టీమ్‌‌ చేతిలో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేనకు ఎదురైన పరాజయానికి కొంతైనా బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.

ఇక ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీమిండియాలో చోటు ఆశిస్తున్న యంగ్‌‌స్టర్స్‌‌ కూడా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. 2016 నుంచి వరుసగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న ఇండియా 2018, 2022లో టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. 2016, 2020లో పరాజయంపాలైంది.  

‘టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దంచితే..

ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను బట్టి చూస్తే టీమిండియాకు ఈ పోరులోనూ ఎదురులేదు. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విఫలమైన టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు  ఆదర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అర్షిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కులకర్ణి, ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. వీళ్లలో ఏ ఒక్కరు క్రీజులో నిలబడినా ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. ఇక సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిపించిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా భారీ అంచనాలున్నాయి.

వీళ్ల మధ్యలో ప్రియాన్షు మోలియా ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావాల్సి ఉంది. లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ కుర్రాడు అవనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫినిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చాలా బాధ్యత ఉంది. దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి భారీ ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాన స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌమీ పాండే 17 వికెట్లతో మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా, ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. పేసర్లు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింబానీ, నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తివారీ స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్లు తీస్తే కంగారూలను ఈజీగా కట్టడి చేయొచ్చు. అవసరమైనప్పుడు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదుకునేందుకు అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అర్షిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రియాన్షు మోలియా రెడీగా ఉన్నారు. 

ప్రతీకారం కోసం..

2012, 2018 ఫైనల్లో ఇండియా చేతిలో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నెరవేరాలంటే కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యూ వీబ్జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యారీ డిక్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రాకెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కల్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడ్లెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలకడగా రాణించాల్సిన అవసరం చాలా ఉంది. లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒలివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టామ్ కాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకం కానున్నారు. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవడానికి ప్రధానం కారణం వీళ్లే. కాబట్టి ఫైనల్లో వీళ్లపై ఇండియా బౌలర్లు ఓ కన్నేసి ఉంచాలి. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రాకెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే అధిక భారం పడనుంది. బియర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విడ్లెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ వికెట్లు తీస్తే ఇండియా భారీ స్కోరును అడ్డుకోవచ్చు.

జట్లు (అంచనా)

ఇండియా: ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అర్షిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కులకర్ణి, ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రియాన్షు మోలియా, సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అరవల్లి అవనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కీపర్​), అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింబానీ, నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తివారీ, సౌమీ పాండే. 

ఆస్ట్రేలియా: హ్యూ వీబ్జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), హ్యారీ డిక్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హర్జాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కీపర్), ఒలివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్ట్రాకెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బియర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విడ్లెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.