రహానె త్వరగా పుంజుకోవాలి

రహానె త్వరగా పుంజుకోవాలి

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌలర్లు కొంతమేర ఆకట్టుకున్నా బ్యాట్స్‌‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రూట్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. టీమిండియాలో ఒక్క బ్యాట్స్‌‌మెన్ కూడా మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ వైఫల్యంపై సీనియర్లు పెదవి విరుస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ రహానె ఫెయిల్యూర్‌‌ల నుంచి బయటపడితే మంచిదని సూచిస్తున్నారు. వెటరన్ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా రహానె ఫామ్‌‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. రహానె త్వరగా పుంజుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కెప్టెన్‌‌గా ఉన్న రహానె కంటే అతడి బ్యాటింగ్‌‌తోనే సమస్య అని మంజ్రేకర్ అన్నాడు. ‘ఆస్ట్రేలియాతో సిరీస్‌‌లో మెల్‌‌బోర్న్‌‌లో సెంచరీ తప్ప మిగిలినవన్నీ రహానెవి తక్కువ స్కోర్లే. క్లాస్ ప్లేయర్లు ఫామ్‌‌ను త్వరగా అందిపుచ్చుకుంటారు. అలాగే ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్ల భారాన్ని కూడా మోస్తారు’ అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.