ఇషాంత్ ఓ అరుదైన యోధుడు

ఇషాంత్ ఓ అరుదైన యోధుడు

చెన్నై: టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న తొలి టెస్టులో 300 వికెట్ల క్లబ్‌‌లో చేరాడు. ఆట మూడో రోజు ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్‌‌ను వరుస బంతుల్లో ఔట్ చేసిన లంబూ.. రేర్ ఫీట్ సాధించాడు. ఇషాంత్ పై ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. ఇషాంత్ ఓ అరుదైన యోధుడని,  కనిపించని హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. టీమిండియా బౌలింగ్ దళంలో చాలా ఏళ్లుగా ఇషాంత్ పెర్ఫామ్ చేస్తున్నాడని, ఓ ఫాస్ట్ బౌలర్‌‌గా ఇది ప్రశంసనీయమని పీటర్సన్ ట్వీట్ చేశాడు.