
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆకట్టుకుంటోంది. హిట్‌మ్యాన్ సెంచరీతో కదం తొక్కడంతో తొలి రోజు ఆటలో భారత్ 6 వికెట్లకు 300 రన్స్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (161) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో స్పిన్ పిచ్‌పై భారత్ మంచి స్కోరు చేయగలిగింది. రోహిత్‌తోపాటు అజింక్యా రహానె (67), రిషభ్ పంత్ (33) ఆకట్టుకున్నారు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తోపాటు విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపర్చారు. తొలి రోజే బంతి బాగా స్పిన్ అవుతుండటంతో పరుగులు తీయడానికి బ్యాట్స్‌మెన్ శ్రమించారు. స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్ అయిన తీరుతో పిచ్ స్పిన్‌కు ఎంతగా అనుకూలిస్తుందో అర్థమైంది. రోహిత్ బ్యాటింగ్‌పై సీనియర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ ఇన్నింగ్స్ ఆడాలని రోహిత్ అనుకోవడం శుభ పరిణామమని, అతడి షాట్ సెలెక్షన్ బాగుందని లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ మెచ్చుకున్నాడు.