వికారాబాద్ అదనపు కలెక్టర్గా రాజేశ్వరి

 వికారాబాద్ అదనపు కలెక్టర్గా రాజేశ్వరి

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్ జిల్లా ఇన్​చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా రాజేశ్వరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్​ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఇంతకుముందు ఇక్కడ జిల్లా అదనపు కలెక్టర్​గా పనిచేసిన లింగ్యా నాయక్ రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిగా బదిలీపై వెళ్లిన సంగతి తెలిసిందే.