జగిత్యాల సబ్‌‌‌‌ జైల్ లో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

జగిత్యాల సబ్‌‌‌‌ జైల్ లో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల సబ్‌‌‌‌ జైల్ లో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో చనిపోయాడు.  నిర్మల్ జిల్లాకు చెందిన కొత్వల్ కృష్ణ (43), ఓ సైబర్ క్రైమ్ కేసులో రిమాండ్ ఖైదీగా జగిత్యాల సబ్ జైల్ కు వచ్చాడు.  సోమవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో అతనికి గుండెలో నొప్పి రావడంతో జైలు సిబ్బందికి తెలిపాడు. 

వెంటనే జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ గుండె పోటుకు గురై మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై జైలు అధికారులు విచారణ చేపట్టారు.