పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు ఇవ్వాలి : తెలంగాణ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్

పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు ఇవ్వాలి : తెలంగాణ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్
  • మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఆఫీస్ సూపరింటెండెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకు ప్రమోషన్ల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలంగాణ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు సోమవారం డీపీహెచ్ అధికారులను అసోసియేషన్ నేతలు కలిశారు. 

కోర్టు స్టేలు లేకున్నా, ఖాళీలున్నా ప్రమోషన్లు ఇవ్వకుండా ఎందుకు పెండింగ్​లో  పెడుతున్నారని అధికారులను నిలదీశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ కాలయాపన చేస్తే ప్రమోషన్ లేకుండానే రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చిందని, వెంటనే అండర్‌‌‌‌ టేకింగ్ తీసుకొని ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.