
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. మరో 25 రోజుల్లో ఈ మెగా సిరీస్ ప్రారంభం కానుంది. 2025-2027 టెస్ట్ సైకిల్ లో భాగంగా టీమిండియాకు ఇదే తొలిసారి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన భారత జట్టు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఈ సిరీస్ కు ఇప్పటికే భారత టెస్ట్ జట్టును బీసీసీఐ శనివారం (మే 24) ప్రకటించింది. భారత ఏ జట్టు ఇంగ్లాండ్ తో ప్రస్తుతం 2 మ్యాచ్ ల అనధికారిక టెస్ట్ ఆడడానికి సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లాండ్ ఇటీవలే జింబాబ్వే జట్టుతో ఏకైక టెస్ట్ ముగించుకుంది.
ఈ సారి భారత్ పూర్తిగా యంగ్ స్టార్లతోనే బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై భారత యువ జట్టుకు అతి పెద్ద సవాలుగా మారనుంది. కనీసం ఇంగ్లాండ్ కు పోటీ అయినా ఇస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభమాన్ గిల్ భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మరోవైపు బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే ఆ జట్టులోని ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉండడంతో సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ను టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ హక్కులను సొంతం చేసుకున్న జియోహాట్‌స్టార్.. టెస్ట్ సిరీస్ డిజిటల్ హక్కులను సైతం సొంతం చేసుకుంది. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ జియో హాట్ స్టార్ భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే సిరీస్ ను ఫ్రీ గా స్ట్రీమింగ్ చేయనుంది. భారత కాలమాన ప్రకారం 5 టెస్ట్ మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ప్రారంభమవుతాయి.
ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్