అభిషేక్ శర్మ పైనే అందరి కండ్లు.. నెదర్లాండ్స్‌‌‌‌తో ఇండియా మ్యాచ్‌‌‌‌

అభిషేక్ శర్మ పైనే అందరి కండ్లు.. నెదర్లాండ్స్‌‌‌‌తో ఇండియా మ్యాచ్‌‌‌‌

అహ్మదాబాద్‌‌‌‌: తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో బ్యాటింగ్‌‌‌‌లో కొంత ఇబ్బంది పడినా.. మూడో పోరులో దాయాది పాకిస్తాన్‌‌‌‌ను చిత్తుగా ఓడించి టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌కు చేరుకున్న టీమిండియా  గ్రూప్‌‌‌‌ దశలో లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు రెడీ అయింది. బుధవారం ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌‌‌‌తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సూపర్-8 రౌండ్‌‌‌‌కు అర్హత సాధించినప్పటికీ, యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. 

గత ఏడాదిన్నరగా తన డేరింగ్ బ్యాటింగ్‌‌‌‌తో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన అభి ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌పై భారీ అంచనాలతో బరిలోకి దిగి సున్నాకే వెనుదిరిగాడు. దాంతో డచ్‌‌‌‌ బౌలర్లపై అయినా తన పాత ఫామ్‌‌‌‌ను అందిపుచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇంకోవైపు అతని ఓపెనింగ్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌‌‌‌లో ఉండటం జట్టుకు ప్లస్‌‌‌‌ పాయింట్‌‌‌‌. ఇషాన్‌‌‌‌తో పాటు అభి కూడా బ్యాట్ ఝుళిపిస్తే కీలకమైన సూపర్‌‌‌‌‌‌‌‌8 రౌండ్‌‌‌‌కు ముందు ఇండియా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.  ఇంకోవైపు గత కొంతకాలంగా ఇండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కోవడంలో కాస్త తడబడుతున్నారు. నమీబియా, పాకిస్తాన్ స్పిన్నర్లు ఇండియా ప్లేయర్లను కట్టడి చేయడంలో సక్సెస్‌‌‌‌ అయ్యారు. ప్రేమదాస స్టేడియంలో పాక్‌‌‌‌ స్పిన్నర్లు 18 ఓవర్లు బౌలింగ్‌‌‌‌ చేసి మనోళ్లను ఇబ్బంది పెట్టారు. 

ఇషాన్ కిషన్ తప్ప మిగతా బ్యాటర్లు పాక్ స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో ఇబ్బంది పడ్డారు.  ఈ నేపథ్యంలో కీలకమైన సూపర్‌‌‌‌‌‌‌‌–8, నాకౌట్‌‌‌‌ దశకు ముందు ఈ లోపాలను సరిదిద్దుకోవడం ఇండియాకు కీలకంగా మారింది. నెదర్లాండ్స్ టీమ్‌‌‌‌లో ఆర్యన్ దత్, వాన్ డెర్ మెర్వ్ వంటి సీనియర్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లు ఉన్నారు. వాళ్లపై పైచేయి సాధించి సూపర్‌‌‌‌‌‌‌‌ పోరుకు ముందు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని ఇండియా బ్యాటర్లు భావిస్తున్నారు.

బుమ్రాకు రెస్ట్‌‌‌‌!
చిన్న జట్టుతో పోరు కావడంతో ఈ మ్యాచ్‌‌‌‌లో టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ పలువురు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే చాన్సుంది. బౌలింగ్ విభాగంలో  కీలకమైన సూపర్-8 మ్యాచ్‌‌‌‌ల దృష్ట్యా పేస్ లీడర్‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా, హార్దిక్‌‌‌‌ పాండ్యాకు రెస్ట్ ఇస్తే మహ్మద్ సిరాజ్, అర్ష్‌‌‌‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు చేపడతారు. 

డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌  ఇండియా ఈ మ్యాచ్‌‌‌‌లో కూడా భారీ విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి దశకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక నమీబియాపై గెలిచి అమెరికా చేతిలో  చిత్తయిన డచ్ టీమ్‌‌‌‌.. బలమైన ఇండియాకు కాస్తయినా పోటీ ఇవ్వాలని చూస్తోంది.