IND vs SA: చివరి టీ20కు నాలుగు మార్పులు.. టీమిండియా తుది జట్టు ఇదే

IND vs SA: చివరి టీ20కు నాలుగు మార్పులు.. టీమిండియా తుది జట్టు ఇదే

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు(డిసెంబర్ 14) చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. జోహనెస్ బర్గ్ వేదికగా న్యూలాండ్స్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సిరీస్ ను సమం చేయాలని భారత్ భావిస్తుంటే.. సిరీస్ పై సఫారీలు కన్నేశారు. రెండో టీ20లో ఓడిపోయిన భారత్ ఈ మ్యాచ్ లో భారీ మార్పులు చేయాలని భావిస్తుందట. ఏకంగా నాలుగు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భారత్ బ్యాటింగ్ విభాగాన్ని పరిశీలిస్తే రెండో టీ20లో రింకూ సింగ్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మినహా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. ఓపెనర్లు జైస్వాల్, గిల్ ఇద్దరి డకౌట్ కాగా.. తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. వికెట్ కీపర్ జితేష్ శర్మ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. దీంతో రెండో టీ20 కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్.. జితేష్ శర్మ స్థానంలో, గైక్వాడ్.. జైస్వాల్ లేదా గిల్ స్థానంలో బ్యాటింగ్ ఆడే అవకాశముంది. ఇక అయ్యర్ మరోసారి బెంచ్ కు పరిమితం కావొచ్చు. 

బౌలింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా సిరీస్ లో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ స్థానంలో రానున్నాడు. రెండో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ అర్ష దీప్ సింగ్ స్థానంలో దీపక్ చాహర్ కు అవకాశం దకొచ్చు. సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి గనుక భారత్ ఈ నాలుగు మార్పులు చేస్తుందో లేకపోతే ఆటగాళ్లకు మరో అవకాశం ఇస్తుందో చూడాలి. మరోవైపు సౌత్ ఆఫ్రికా గెలిచిన జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. భారత కాలమాన ప్రకారం రాత్రి 8:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 
   
భారత్ తుది జట్టు(అంచనా): 

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, ఇషాన్ కిషన్,  రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్