నేటి వన్డే మ్యాచ్ ను స్వీప్​ చేస్తారా?

నేటి వన్డే మ్యాచ్ ను స్వీప్​ చేస్తారా?
  • క్లీన్​స్వీప్​పై గురి 
  • ఓపెనర్‌‌‌‌ ధవన్‌‌ రిటర్న్‌‌
  • సిరాజ్‌‌, హుడాకు రెస్ట్!
  • మ. 1.30 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌: ఓవైపు క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌పై ఇండియా దృష్టి.. మరోవైపు పరువు కోసం వెస్టిండీస్‌‌‌‌ పోరాటం.. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య థర్డ్‌‌‌‌ వన్డేకు రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను ఇప్పటికే 2–0తో కైవసం చేసుకున్న టీమిండియా.. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ విక్టరీనే టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. కొవిడ్‌‌‌‌ నుంచి కోలుకున్న ఓపెనర్‌‌‌‌ శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌ ఎంట్రీతో టీమిండియా బ్యాటింగ్‌‌‌‌ మరింత బలోపేతమైంది. దీంతో పాటు ఫస్ట్‌‌‌‌ రెండు వన్డేల్లో చాన్స్‌‌‌‌ వచ్చిన ప్రతి ప్లేయర్‌‌‌‌ మంచి పెర్ఫామెన్స్‌‌‌‌ చూపెట్టారు. అయినప్పటికీ థర్డ్‌‌‌‌ వన్డే కోసం విన్నింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ మార్చే చాన్స్‌‌‌‌ ఉంది. ధవన్‌‌‌‌ లేకపోవడంతో ఫస్ట్‌‌‌‌ వన్డేలో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌తో, సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌తో ఓపెనింగ్‌‌‌‌ చేయించారు. ఇప్పుడు ధవన్‌‌‌‌ అందుబాటులోకి రావడంతో కచ్చితంగా అతనికి చాన్స్‌‌‌‌ ఇస్తామని సెకండ్‌‌‌‌ వన్డే తర్వాత కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ క్లియర్‌‌‌‌ ఇన్ఫర్మేషన్‌‌‌‌ ఇచ్చాడు. కాబట్టి ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో మార్పులు ఖాయమే. 

మిడిల్‌‌‌‌లోనే రాహుల్‌‌‌‌..
ఓపెనర్లుగా ధవన్‌‌‌‌, రోహిత్‌‌‌‌ ఖాయం కాబట్టి.. కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ మరోసారి మిడిలార్డర్‌‌‌‌కే పరిమితం కానున్నాడు. సూర్యకుమార్‌‌‌‌, రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌తో కలిసి బాధ్యతలు పంచుకోనున్నాడు. అయితే వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఫెయిలైన మాజీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీని కంటిన్యూ చేస్తారా? ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? చూడాలి. ఈ నలుగుర్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ దీపక్‌‌‌‌ హుడా బెంచ్‌‌‌‌కు పరిమితం కానున్నాడు. శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ కూడా సెలెక్షన్‌‌‌‌కు అందుబాటులోకి వస్తే అప్పుడు ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రిజల్ట్‌‌‌‌తో పని లేకుండా రిజర్వ్‌‌‌‌ ప్లేయర్లకు మ్యాచ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ కల్పిస్తామని రోహిత్‌‌‌‌ చెబుతున్నాడు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే కోహ్లీకీ బ్రేక్‌‌‌‌ ఇవ్వొచ్చు. ఇక టాస్‌‌‌‌ గెలిస్తే కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా భారీ స్కోరు చేయాలని కెప్టెన్​ రోహిత్​తోపాటు టీమ్​ మేనేజ్​మెంట్​ భావిస్తోంది. ఇక బౌలింగ్‌‌‌‌లోనూ సంచలన నిర్ణయాలు లేకపోవచ్చు. సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న ప్రసిధ్ కృష్ణ, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ను కంటిన్యూ చేయనున్నారు.  మధ్యప్రదేశ్‌‌‌‌ పేసర్‌‌‌‌ ఆవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇవ్వాలనుకుంటే మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ను పక్కనబెట్టొచ్చు. రిస్ట్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌.. ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడక నెలలు గడిచిపోతున్నాయి. కాబట్టి అతన్ని ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లోకి తీసుకుంటే చహల్‌‌‌‌, సుందర్‌‌‌‌లో ఒకరు తప్పుకోవాల్సిందే.

టీమ్స్‌‌‌‌ (అంచనా)

ఇండియా: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), ధవన్‌‌‌‌, కోహ్లీ, రాహుల్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌ / దీపక్​ హుడా, పంత్‌‌‌‌ (కీపర్​),  సుందర్‌‌‌‌ , శార్దూల్‌‌‌‌, సిరాజ్​,  చహల్‌‌‌‌/ కుల్దీప్‌‌‌‌ యాదవ్​, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ. . 
వెస్టిండీస్‌‌‌‌:  షై హోప్‌‌‌‌ (కీపర్​), కింగ్‌‌‌‌, డారెన్ బ్రావో,  బ్రూక్స్‌‌‌‌, పూరన్, పొలార్డ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), హోల్డర్‌‌‌‌, అలెన్‌‌‌‌, హొస్సేన్‌‌‌‌, అల్జారీ జోసెఫ్‌‌‌‌, రోచ్.

బ్యాటింగ్‌‌‌‌‌‌పైనే విండీస్ ఫోకస్​..
ఇప్పటికే సిరీస్‌‌‌‌ కోల్పోయిన వెస్టిండీస్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ను ఇంప్రూవ్‌‌‌‌ చేసుకోవడంపై దృష్టి పెట్టింది. కాబట్టి ఈ మ్యాచ్‌‌‌‌కు తుది జట్టులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా టీ20 హిట్టర్లకు ఎక్కువ చాన్స్‌‌‌‌ ఇచ్చేలా ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. ఈ నేపథ్యంలో పొలార్డ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా మళ్లీ ఎంట్రీ ఇవ్వొచ్చు. వరుసగా ఫెయిల్‌‌‌‌ అవుతున్న హోప్‌‌‌‌, బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌, పూరన్‌‌‌‌, పొలార్డ్‌‌‌‌.. భారీ రన్స్‌‌‌‌తో గాడిలో పడాలనుకుంటున్నారు. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ మరోసారి కీలకం కానున్నాడు. బ్యాటింగ్‌‌‌‌తో పోలిస్తే విండీస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ మెరుగ్గా ఉంది. కాబట్టి పేసర్లు రోచ్‌‌‌‌, జోసెఫ్‌‌‌‌, ఓడెన్ స్మిత్‌‌‌‌ను కంటిన్యూ చేయనున్నారు. స్పిన్నర్లుగా ఫాబియన్‌‌‌‌ అలెన్‌‌‌‌, అకీల్‌‌‌‌ హోస్సేన్‌‌‌‌ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.