పాక్ కాదు వన్డేల్లో టీమిండియానే నెంబర్ వన్.. కానీ అలా జరగాలి

పాక్ కాదు వన్డేల్లో టీమిండియానే నెంబర్ వన్.. కానీ అలా జరగాలి


ఐసీసీ నెంబర్ వన్ వన్డే స్థానం కోసం ప్రస్తుతం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు  118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..116 పాయింట్లతో భారత్ రెండవ స్థానంలో నిలిచింది. కేవలం రెండు పాయింట్లు తేడా ఉండడంతో టీమిండియా ఇప్పుడు నెంబర్ వన్ స్థానంపై కన్నేసింది. కానీ అలా జరగాలంటే సమీకరణాలు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. 


ఆసియా కప్ గెలవడంతో పాటు.. 

ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ జట్లు ఆసియా కప్ ఆడుతుండగా.. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో 5 వన్డేల సిరీస్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మీద సూపర్-4 మ్యాచ్ గెలవడంతో పాటు ఆసియా కప్ ఫైనల్ కూడా నెగ్గాలి. అదే సమయంలో పాకిస్థాన్ నేడు జరిగే సూపర్-4 మ్యాచులో శ్రీలంక మీద ఓడిపోవాలి. ఈ రెండింటితో పాటు ఆస్ట్రేలియా చివరి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి. ఇవన్నీ జరిగితే టీమిండియా వన్డేల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. 


టెస్ట్,టీ 20ల్లో నెంబర్ వన్ 

ఇక వన్డే ఫార్మాట్ మినహాయిస్తే మిగిలిన రెండు ఫార్మాట్లలో టీమిండియా అగ్ర స్థానంలో ఉండడం విశేషం. 118 పాయింట్లతో టెస్టుల్లో, 264 పాయింట్లతో టీ 20 ల్లో టాప్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వన్డేల్లో కూడా నెంబర్ వన్ స్థానానికి చేరితే వరల్డ్ కప్  సమయానికి అన్ని ఫార్మాట్ లలో నెంబర్ వన్ జట్టుగా అవతరిస్తుంది.             

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)