IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు నేడే స్క్వాడ్ ప్రకటన.. పాండ్య, పంత్ ఔట్.. రోహిత్, కోహ్లీ కంబ్యాక్

IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు నేడే స్క్వాడ్ ప్రకటన.. పాండ్య, పంత్ ఔట్.. రోహిత్, కోహ్లీ కంబ్యాక్

ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టును శనివారం (అక్టోబర్ 4) ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ సిరీస్ కు భారత జట్టుపై ఆసక్తి నెలకొంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. కోహ్లీని గ్రౌండ్ లో చూడడానికి ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని స్క్వాడ్ ను ప్రకటించే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేయబోయే 15 మంది భారత స్క్వాడ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..          

పాండ్య, పంత్ ఔట్:

ఆస్ట్రేలియా సిరీస్ కు గాయాల కారణంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరం కానున్నారు. ఆసియా కప్ ఫైనల్ కు ముందు పాండ్య మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫైనల్ ఆడకుండానే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పాండ్య కోలుకోవడానికి నాలుగు వరాల రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. ఈ కారణంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన పంత్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోవడంతో ఈ మెగా సిరీస్ కు దూరం కానున్నాడు. 

గిల్, బుమ్రాలకు రెస్ట్ ఇస్తారా..?

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్టు సమాచారం. ఇటీవలే ఆసియా కప్ ముగిసిన వెంటనే వీరిద్దరూ మూడు రోజుల గ్యాప్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ ఆడుతున్నారు. విండీస్ తో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత నాలుగు రోజులే గ్యాప్ ఉండడంతో పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని బుమ్రా, గిల్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  

రోహిత్, విరాట్ కంబ్యాక్ గ్యారంటీ:  

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియ సిరీస్ కు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. టీ20, టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్.. ఆ తర్వాత టీ20 ఫార్మాట్ లో జరుగుతున్న ఆసియా కప్.. ఇలా వన్డే సిరీస్ ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ కు రోహిత్, కోహ్లీ భారత జట్టులో కనిపించడం ఖాయం. 

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్: 

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

ఆస్ట్రేలియా సిరీస్ కు భారత జట్టు (అంచనా): 
 
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా