
చెంగ్డు (చైనా): ఉబెర్ కప్‌లో యంగ్ షట్లర్లతో కూడిన ఇండియా విమెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన గ్రూప్–ఎ రెండో మ్యాచ్‌లో ఇండియా అమ్మాయిలు 4–1తో సింగపూర్‌ను చిత్తు చేశారు. గ్రూప్‌లో వరుసగా రెండు విజయాలతో క్వార్టర్స్ బెర్తు కైసవం చేసుకున్నారు. తొలి సింగిల్స్‌లో అష్మితా చాలిహా ఓడినా మిగతా షట్లర్లంతా సత్తాచాటారు. డబుల్స్‌లో ప్రియా–శ్రుతి, సిమ్రన్ సింఘి–రితిక, సింగిల్స్‌లో ఇషారాణి, రైజింగ్ స్టార్ అన్మోల్ ఖర్బ్ తమ ప్రత్యర్థులను ఓడించారు. మంగళవారం జరిగే గ్రూప్ చివరి మ్యాచ్‌లో చైనాతో అమ్మాయిలు పోటీ పడనుండగా, థామస్ కప్‌లో భాగంగా సోమవారం జరిగే మ్యాచ్‌లో ఇండియా మెన్స్ టీమ్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది.