సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి ..ఇవాళ ఆస్ట్రేలియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడో వన్డే

సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి ..ఇవాళ ఆస్ట్రేలియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడో వన్డే


న్యూఢిల్లీ: తొలి వన్డేలో ఓడి.. రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచిన ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు.. ఇప్పుడు చరిత్రాత్మక సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శనివారం జరిగే ఆఖరిదైన మూడో వన్డేలో గెలిచి చరిత్రను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా.. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సిరీస్​ గెలవలేదు. కాబట్టి సిరీస్​ విజయంతో పాటు రాబోయే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. 

అయితే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేలిపోయిన ఇండియా.. రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంది. అయినప్పటికీ కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత మెరుగుపర్చుకోవాలి. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కలిపి 10 క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే బౌలర్లు రాణిస్తుండటం ఇండియాకు కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచే అంశం. రేణుకా ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రాంతి గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇదే ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఒత్తిడిని మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కంటిన్యూ చేస్తే భారీ స్కోరును అడ్డుకోవచ్చు. మూడో సీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అరుంధతి రెడ్డిని తీసుకోవడం కూడా కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్మృతి మంధాన, ప్రతీకా రావల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదిరిపోయే ఆరంభాన్నిస్తున్నా.. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాడిలో పడాల్సి ఉంది. మరోవైపు ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా విజయంపైనే కన్నేసింది. లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీసా హీలీ వెల్లడించింది. 2024 ఫిబ్రవరిలో సౌతాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత ఆడిన 13 వన్డేల్లో గెలిచింది.