చెన్నై: తమిళనాడులో త్రిష, విజయ్ బంధం మరోసారి హాట్ టాపిక్ అయింది. విజయ్ను ఇన్ స్టాగ్రాంలో త్రిష అన్ ఫాలో చేయడం, జూన్ 22న విజయ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసినా త్రిష శుభాకాంక్షలు చెప్పకపోవడంతో ఈ ఇద్దరి బంధానికి బీటలు వారాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
గత కొన్నేళ్లుగా.. త్రిష, విజయ్‌తో కలిసి ఉన్న అరుదైన చిత్రాలను, అతని పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన త్రిష.. విజయ్ బర్త్ డే అయినప్పటికీ కనీసం విష్ చేయకపోవడం చర్చకు దారితీసింది. అంతేకాకుండా.. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో విజయ్ను అన్‌ఫాలో చేయడాన్ని కూడా అభిమానులు గమనించారు. ఈ పరిణామాలను గమనించిన విజయ్ అభిమానులు.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ఊహాగానాలను నమ్మక తప్పని పరిస్థితి ఉంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయ్, త్రిష బంధం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ భార్య విడాకుల పిటిషన్తో ఈ ఎపిసోడ్ సినిమాను తలపించింది. విజయ్ రాజకీయ భవిష్యత్ మటాష్ అని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేసుకున్నారు. కానీ.. విజయ్ వ్యక్తిగత జీవితం గురించి తమకు అనవసరం.. ఆయనే తమ నాయకుడు అని తమిళనాడు ఓటర్లు తేల్చేశారు. అనూహ్య పరిణామాల మధ్య విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా త్రిష హాజరయింది.
విజయ్ భార్య, పిల్లలు కూడా వెళ్లని విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష వెళ్లడంతో విజయ్, త్రిష త్వరలో పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం కూడా జోరుగా నడిచింది. విజయ్ తల్లి కూడా త్రిషను ఆప్యాయంగా పలకరించడం, ఆదరించడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.
ఇంతలో ఏమైందో తెలీదు.. త్రిష, విజయ్ మధ్య దూరం పెరిగిందని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గిల్లి, లియో, గోట్ సినిమాల్లో విజయ్, త్రిష కలిసి నటించారు. త్రిష ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో సూర్య సరసన 'కరుప్పు' చిత్రంలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
