Women's ODI World Cup 2025: ప్లేయింగ్ 11లో మరోసారి తడబడిన టీమిండియా.. హర్లీన్ డియోల్‌పై వేటు

Women's ODI World Cup 2025: ప్లేయింగ్ 11లో మరోసారి తడబడిన టీమిండియా.. హర్లీన్ డియోల్‌పై వేటు

మహిళల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై మ్యాచ్ అంటేనే ఇండియా తడబడుతుంది. గురువారం (అక్టోబర్ 30) ప్రారంభమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో అనవసర ప్రయోగాలు చేసింది. ఒక బ్యాటర్ ను తక్కువ చేసి ఎక్కువ బౌలర్లకు అవకాశమిచ్చింది. నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  హర్లీన్ డియోల్ స్థానంలో క్రాంతి గౌడ్ ప్లేయింగ్ 11లోకి వచ్చింది. ఫామ్ లో ఉన్న హర్లీన్ డియోల్ ను ప్లేయింగ్ 11 లో తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఏడాదికాలంగా వన్డే జట్టులో స్థానం కోల్పోయిన షెఫాలీ వర్మను ప్లేయింగ్ 11 లోకి తీసుకువచ్చి.. ఫామ్ లో ఉన్న డియోల్ ను పక్కన పెట్టారు. డియోల్ ఏడాది కాలంగా అద్భుతంగా ఆడుతోంది. వన్డే కెరీర్ లో 33 యావరేజ్ తో బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. సెమీ ఫైనల్ కు ముందు స్మృతి మందానతో కలిసి హర్లీన్ డియోల్ బ్యాటింగ్ చేస్తుందని చాలామంది భావించారు. అయితే డియోల్ కు షాకిస్తూ తుది జట్టు నుంచి తప్పించారు. ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న షెఫాలీ బ్యాటింగ్ ఫామ్ పై ఒక క్లారిటీ లేదు. అదే సమయంలో డియోల్ ను పక్కన పెట్టారు. మరి ఈ నిర్ణయం వర్కౌట్ అవుతుందో లేకపోతే తేడా కొడుతుందో చూడాలి. 

వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, రావల్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్ సగటు 78.21తో పోలిస్తే, మంధాన–-షెఫాలీ  జోడీ సగటు 37.20 మాత్రమే ఉంది. మరోవైపు  కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ ఫామ్‌‌‌‌‌‌‌‌ కూడా జట్టును ఆందోళన కలిగిస్తోంది. టోర్నీలో ఇప్పటిదాకా తన మార్కు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడని హర్మన్‌‌‌‌‌‌‌‌... 2017 సెమీస్‌‌ లాంటి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేయాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆశిస్తోంది. టోర్నీలో 365 రన్స్‌‌‌‌‌‌‌‌తో సెకండ్ టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న మంధాన ఆటపైనే ఇండియా విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. హర్మన్, హర్లీన్, జెమీమా కూడా సత్తా చాటితేనే ఆసీస్‌‌‌‌‌‌‌‌ అడ్డు దాటగలం. 

భారత మహిళలు (ప్లేయింగ్ XI):

షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్