బ్రిస్టల్: చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో స్మృతి మంధాన (32), యాస్తిక భాటియా (33) రాణించినా.. మిగతా వారు నిరాశపర్చడంతో ఇండియా విమెన్స్ జట్టుకు ఓటమి తప్పలేదు. శనివారం (మే 30) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 26 రన్స్ తేడాతో ఇండియాపై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1–1తో నిలిచాయి.
టాస్ నెగ్గిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 168/5 స్కోరు చేసింది. ఫ్రెయా కెంప్ (39 నాటౌట్), డ్యానీ హోడ్జ్ (29), అమీ జోన్స్ (28), అలైస్ క్యాప్సే (28) మెరుగ్గా ఆడారు. శ్రీచరణి మూడు వికెట్లు తీసింది. తర్వాత ఇండియా 20 ఓవర్లలో 149/9 స్కోరుకే పరిమితమైంది. షెఫాలీ వర్మ (22), హర్మన్‌ప్రీత్ (28) ఫర్వాలేదనిపించారు.
ఓ దశలో 109/2తో పటిస్ట స్థితిలో ఉన్న ఇండియాను ఇంగ్లిష్ బౌలర్లు ఘోరంగా దెబ్బ కొట్టారు. 42 రన్స్ తేడాలో 7 వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టారు. ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లారెన్ బెల్, చార్లీ డీన్, కెంప్ తలా రెండు వికెట్లు తీశారు. కెంప్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
