శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్‌లో లంక 13 పరుగులు చేయాల్సి ఉండగా.. అక్షర్ అదిరిపోయే ఓవర్ వేసి భారత జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. ఈ పోరులో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 160 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
మూడు టీ20ల సిరీస్‌లో భారత మిడిలార్డర్ అద్భుతంగా రాణించింది. టాప్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్ (37) మినహా ఎవరూ రాణించలేదు. అయితే మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్య (29), దీపక్ హుడా (41), అక్షర్ పటేల్ (31) కీలకమైన పరుగులు చేశారు. ఆరో వికెట్‌కు హుడా–అక్షర్ కలిసి కేవలం 35 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 162/5 స్కోరు సాధించింది.
టీమిండియా బౌలర్లో శివమ్ మావి 4, ఉమ్రాన్ మాలిక్ 2, హర్షల్ పటేల్ 2 వికెట్లతో సత్తా చాటారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1–0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది.