Women's ODI World Cup 2025: ఆస్ట్రేలియా వీర ఉతుకుడు.. టీమిండియాను టెన్షన్ పెడుతున్న బిగ్ టార్గెట్

Women's ODI World Cup 2025: ఆస్ట్రేలియా వీర ఉతుకుడు.. టీమిండియాను టెన్షన్ పెడుతున్న బిగ్ టార్గెట్

మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో ఇండియా బౌలర్స్ ఆకట్టుకోలేకపోయారు. గురువారం (అక్టోబర్ 30) నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు భారీ స్కోర్ ఇచ్చారు. టీమిండియా వీక్ బౌలింగ్ ను ఒక ఆటాడుకుంటూ ఆసీస్ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (93 బంతుల్లో 119: 17 ఫోర్లు, 3 సిక్సర్లు)   మెరుపు సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 119 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. పెర్రీ (77), గార్డ్ నర్ (63) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. 

టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ప్రమాదకరమైన కెప్టెన్ హీలేను 5 పరుగులకే ఔట్ చేసి క్రాంతి గౌడ్ క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీంతో ఆస్ట్రేలియా 25 పరుగుల వద్ద తమ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పెర్రీతో కలిసిన లిచ్‌ఫీల్డ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. వరుసబెట్టి బౌండరీలు బాదుతూ హాఫ్ సెంచరీ.. ఆ తర్వాత 77 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకుంది. వీరిద్దరూ రెండో వికెట్ కు 155 పరుగుల భారీ బాగాస్వాయం నెలకొల్పి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అమన్ జ్యోత్ కౌర్ విడగొట్టింది. 

సెంచరీ చేసి వేగంగా ఆడుతున్న లిచ్‌ఫీల్డ్ ను బౌల్డ్ చేసి భాగస్వామ్యానికి బ్రేక్ వేసింది.  ఆ తర్వాత మూనీతో కలిసి పెర్రీ 40 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే ఒక్కసారిగా టీమిండియా బౌలర్లు పుంజుకున్నారు. 45 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు తీసి ఆసీస్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. చివర్లో గార్డ్ నర్ చెలరేగి ఆడడంతో ఆసీస్ స్కోర్ ను 330 పరుగులు దాటింది. ఇండియా బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్,రాధా యాదవ్ లకు ఒక్కో వికెట్ దక్కింది.