మాగ్నస్, లిరెన్‌‌కు గుకేశ్‌‌‌‌ షాక్

మాగ్నస్, లిరెన్‌‌కు గుకేశ్‌‌‌‌ షాక్

వాంగెల్స్ (జర్మనీ): ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్‌‌‌‌‌‌‌‌ డి. గుకేశ్ ఒకే రోజు ఇద్దరు వరల్డ్ చాంపియన్లను ఓడించి  సంచలనం సృష్టించాడు. వీసెన్‌‌‌‌హాస్ చెస్ చాలెంజ్ టోర్నమెంట్‌‌‌‌లో వరుసగా మూడు రౌండ్స్‌‌‌‌లో నార్వే చెస్ లెజెండ్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌, అమెరికా స్టార్ లెవోన్ అరోనియన్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్‌‌‌‌ డింగ్ లిరెన్‌‌‌‌ను ఓడించి ఔరా అనిపించాడు.

శుక్రవారం రాత్రి జరిగిన  ర్యాపిడ్ సెక్షన్ తొలి రౌండ్‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌కు చెందిన అలీరెజా ఫిరౌజా చేతిలో ఓడిన గుకేశ్‌‌‌‌.. రెండో  రౌండ్‌‌‌‌లో కార్ల్‌‌‌‌సన్‌‌‌‌కు షాకిచ్చాడు. మూడో రౌండ్‌‌‌‌లో అరోనియన్‌‌‌‌పై గెలిచిన అతను తర్వాతి రౌండ్‌‌‌‌లో లిరెన్‌‌‌‌కు చెక్ పెట్టాడు. దాంతో తొలి రోజు నాలుగు రౌండ్లకు గాను 3 పాయింట్లతో జాయింట్​గా సెకండ్ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు.