పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌కు రైజా, అనంత్‌‌‌‌

పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌కు రైజా, అనంత్‌‌‌‌

కువైట్‌‌‌‌ సిటీ: ఇండియా యంగ్‌‌‌‌ షూటర్స్‌‌‌‌ రైజా ధిల్లాన్‌‌‌‌, అనంత్‌‌‌‌ జీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ నరుకా.. పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌కు అర్హత సాధించారు. ఆసియా ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌ స్కీట్‌‌‌‌ ఫైనల్లో రెజా 52 పాయింట్లతో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ సొంతం చేసుకుంది. మెన్స్‌‌‌‌ ఫైనల్లో అనంత్‌‌‌‌ 57 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు.