భాగ్యనగరానికి భారత్, ఆసీస్ టీమ్స్

భాగ్యనగరానికి భారత్, ఆసీస్ టీమ్స్

మూడో టీ20 ఆడేందుకు భారత ఆస్ట్రేలియా జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి.  నాగ్పూర్ నుంచి ఆటగాళ్లు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెండు జట్ల ఆటగాళ్లను చూసేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భారీగా అభిమానులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు నడుమ ఎయిర్ పోర్టు నుంచి ఆటగాళ్లు డైరెక్ట్గా హోటల్కు వెళ్లారు. 

ఉదయం ప్రాక్టీస్ 
సిటీకి చేరుకున్నఇరు జట్లు...ఆదివారం రేపు ఉదయం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లు ఉంటున్న హోటల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా..అటు ఉప్పల్ స్టేడియాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 2500 మందితో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 300 అధునాతన సిసి కెమెరాలతో నిఘా పెట్టారు. మూడేళ్ళ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్  జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం HCA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సాయంత్రం రెండు జట్ల మధ్య మ్యాచ్ మొదలు కానుంది.