
న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లక్ష్మీవిలాస్ బ్యాంక్‌లో విలీనం కావడానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని కొత్త మార్కెట్లకు విస్తరించడం, మరింత మూలధన సేకరణ కోసం ఇండియాబుల్స్‌ను షేర్ల మార్పిడి ద్వారా కొంటున్నామని ఈ ఏడాది ఏప్రిల్‌లో లక్ష్మీవిలాస్ బ్యాంక్ ప్రకటించింది. ఈ విలీనానికి లక్ష్మీవిలాస్ బ్యాంక్ బోర్డు కూడా ఆమోదించింది. బ్యాంకు షేర్‌హోల్డర్లకు ఉన్న ప్రతి 100 షేర్లకుగానూ ఇండియాబుల్స్ నుంచి14 షేర్లు దక్కుతాయి. ఈ రెండింటి విలీనంతో ఏర్పడే కొత్త సంస్థలో 14,302 మంది ఉద్యోగులు ఉంటారు. లోన్‌బుక్ పరిమాణం 1.23 లక్షల కోట్లకు చేరుతుంది.