
మల్కాజిగిరి, వెలుగు: కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాల కోసం ఈ నెల 18న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జి. మహాలక్ష్మి తెలిపారు. అసోసియేట్ ప్రొఫెసర్ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ 7, ట్యూటర్ 5 పోస్టుల కోసం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సువిధ హాస్పిటల్ పక్కన కుషాయిగూడలో ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు సీడీఎస్ అకౌంట్ పేరుతో రూ.1000 డీడీ ద్వారా చెల్లించి,పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://gmcqubullapur.org వెబ్‌సైట్ లేదా, డాక్టర్ నవ కల్యాణి (వైస్ ప్రిన్సిపాల్) ను 9849230566లో సంప్రదించాలన్నారు.