
ఎల్కతుర్తి, వెలుగు: కంటి చూపు మందగించగా, ఆపరేషన్ చేసుకున్నా చూపు వస్తదో, రాదో? అని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన గుగులోత్ దేవయ్య (55), కమలాబాయి భార్యాభర్తలు. కమలాబాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలిగా పని చేస్తుండగా, దేవయ్య ఇంటి వద్దే ఉంటున్నాడు.
ఇటీవల కంటి చూపు మందగించడంతో దవాఖానలో చూపించుకోగా, ఆపరేషన్ చేయాలని డాక్టర్ తెలిపాడు. అయితే ఆపరేషన్ చేయించుకున్నా కంటి చూపు రాకపోవచ్చనే అనుమానంతో ఆందోళనకు గురై ఆదివారం రాత్రి ఇంటిలో ఉరేసుకున్నాడు. దేవయ్యను హుజూరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.