హైదరాబాద్లో జెడ్ఎస్ ఆఫీస్.. సుమారు 550-600 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం

హైదరాబాద్లో జెడ్ఎస్ ఆఫీస్.. సుమారు 550-600 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం

న్యూఢిల్లీ: గ్లోబల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కన్సల్టింగ్ టెక్నాలజీ సంస్థ జెడ్​ఎస్​ సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కొత్త ఆఫీస్​ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ఫార్మా, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ వంటి రంగాలలో ఉన్న కంపెనీలకు సేల్స్, మార్కెటింగ్ సేవలను అందిస్తుంది. డేటా అనలిటిక్స్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కన్సల్టింగ్ వంటి వాటిని ఉపయోగించి కస్టమర్లతో ఎలా సంబంధాలు పెంచుకోవాలి, అమ్మకాలు ఎలా పెంచుకోవాలి అనే విషయాలలో కంపెనీలకు సలహాలు ఇస్తుంది. రహేజా ఐటీ పార్క్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 50 వేల చదరపు అడుగుల సౌకర్యంలో సుమారు 550–-600 మంది ఉద్యోగులు పనిచేయవచ్చు. అమెరికాలో 1983లో ఏర్పాటైన జెడ్​ఎస్​కు​ ప్రపంచవ్యాప్తంగా 35కిపైగా ఆఫీసులు, 13 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. దీనికి మనదేశంలో, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్  నోయిడాలో ఆఫీసులు ఉన్నాయి.