
కమల్ హాసన్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్టు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కమల్ హాసన్ లుక్ ఆకట్టుకుంటోంది.
తప్పును అస్సలు భరించలేను’ అని క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కమల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మనోబాల, బ్రహ్మానందం, సముద్రఖని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.