బాలాకోట్ దాడి: చెట్లను ధ్వంసం చేశారంటూ భారత్ పై పాకిస్తాన్ కేసు

బాలాకోట్ దాడి: చెట్లను ధ్వంసం చేశారంటూ భారత్ పై పాకిస్తాన్ కేసు

బాలాకోట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడుల్ని పాకిస్థాన్ సీరియస్ గా తీసుకుంది. అయితే అది దాడిలో చనిపోయిన టెర్రరిస్టుల గురించి కాదట. ఆ ప్రాంతంలో 19 చెట్లను ఇండియన్ పైలట్లు ధ్వంసం చేశారని.. ఈమేరకు పాకిస్థాన్ అటవీశాఖ కేసు పెట్టినట్లు ద ట్రిబ్యున్ న్యూస్ పేపర్ వెల్లడించింది. పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ శిబిరాలపై బాంబులు వేశామని, పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు హతమైనట్లు గత మంగళవారం ఇండియా ప్రకటించింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఇండియా ఎకో టెర్రరిజంకు పాల్పడుతోందని, పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు యూఎన్ లో ఫిర్యాదు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పైన్ చెట్లు కూలడం తప్ప అక్కడ ఏం జరగలేదని పాకిస్థాన్ మంత్రి మాలిక్ అమిన్ అస్లమ్ గత వారం రాయిటర్స్ కు చెప్పారు. టెర్రరిస్టు క్యాంపు వద్ద పెద్దగా నష్టం జరగలేదని రాయిటర్స్ చెబుతోంది. అయితే 80 శాతం టార్గెట్ ను హిట్ చేశామని కేంద్ర ప్రభుత్వానికి ఐఏఎఫ్ శాటిలైట్, రాడార్ ఇమేజ్ లను ఇచ్చింది.