76 దేశాలు, 15 వేల మంది పోటీ..ఈమేనే తెలివైన పిల్ల

76 దేశాలు, 15 వేల మంది పోటీ..ఈమేనే తెలివైన పిల్ల

ఇండో అమెరిక‌న్ స్టూడెంట్ న‌టాషా పెరియ‌నాయ‌గ‌ంకు వ‌ర‌ల్డ్స్ బ్రైటెస్ట్ స్టూడెంట్ అవార్డు దక్కింది. వ‌రుస‌గా రెండోసారి ఆమె ఈ అవార్డు దక్కించుకుంది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ సెంట‌ర్ ఫ‌ర్ ట్యాలెంటెడ్ యూత్ ఈ అవార్డును అందజేసింది. 76 దేశాల‌కు చెందిన 15 వేల మంది విద్యార్థుల‌కు గ్రేడ్ లెవ‌ల్ ప‌రీక్షలు నిర్వహించగా.. అందులో న‌టాషా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 13ఏళ్ల నటాషా న్యూ జెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం గాడినీర్ మిడిల్ స్కూల్‌లో చ‌దువుతోంది. 2021లో ఐదో గ్రేడ్ లో ఉండగా జాన్స్ హాప్కిన్స్ సెంట‌ర్‌ ఫర్ టాలెంటెడ్ యూత్ ఎగ్జామ్ రాసింది. వ‌ర్బల్‌, క్వాంటిటేటివ్ సెక్షన్లలో ఆమె ప్రతిభ 8వ గ్రేడ్ స్టూడెంట్స్ తో స‌మానంగా ఉన్నట్లు యూనివర్సిటీ నిర్వాహకులు గుర్తించారు. ఈ ఏడాది నిర్వహించిన ఎగ్జామ్ లో  కూడా న‌టాషా అసాధార‌ణ ప్రతిభ క‌న‌బ‌రిచింది. SAT, ACT స్కూల్ అండ్ కాలేజ్ ఎబిలిటీ టెస్టులో ఆమె చూపిన ప్రతిభకుగానూ ఇప్పుడు  ఈ పురస్కారం దక్కింది. నటాషా ఖాళీ సమయంలో జేఆర్ఆర్ టోల్కీన్ నవలలు చదవుతుందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.