
వాషింగ్టన్: ‘నాసా’లో మన దేశ మూలాలున్న వ్యక్తిని కీలక పదవి వరించింది. నాసా చీఫ్ టెక్నాలజిస్ట్ గా ఎ.సి.చరణియా నియమితుల య్యారు. నాసా చీఫ్ అడ్మినిస్ట్రేటర్బిల్ నెల్సన్‌కు ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా చరణియా వ్యవహరిస్తారు. ఈ బాధ్యతలను ఆయన జనవరి 3నే చేపట్టారు. నాసాకు చెందిన 6 మిషన్ల డైరెక్టరేట్ల పరిధిలో చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమకూర్చే వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తారు.
అమెరికా ప్రభుత్వ, ప్రైవేటురంగంతో నాసా సాంకేతిక సంబంధాలను బలోపేతం చేయడం పై ఫోకస్ చేస్తారు. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న భవ్యా లాల్ కూడా ఇండియన్ ఆరిజన్‌కు చెందిన సైంటిస్టే కావడం విశేషం! మన దేశమూలాలున్న సైంటిస్ట్ సేవలందించారు.